News25th Nov 03:11 PMSunil Byrisetty1 min read
నేటి విద్యార్థులే రేపటి మా భవిష్యత్
హక్కులతో పాటు బాధ్యతలు కూడా ముఖ్యమని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రేపటి స్టూడెంట్ మాక్ అసెంబ్లీకి ఎంపికైన మంగళగిరి విద్యార్థిని కూర్మాల శ్రీ కనకపుట్లమ్మను మంత్ర
హక్కులతో పాటు బాధ్యతలు కూడా ముఖ్యమని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రేపటి స్టూడెంట్ మాక్ అసెంబ్లీకి ఎంపికైన మంగళగిరి విద్యార్థిని కూర్మాల శ్రీ కనకపుట్లమ్మను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఈ మేరకు ఉండవల్లి నివాసానికి సదరు విద్యార్థినితో పాటు కుటుంబ సభ్యులను పిలిపించుకుని మాట్లాడారు. మంగళగిరి బీఆర్ నగర్ లోని మున్సిపల్ హైస్కూల్ లో 8వ తరగతి చదువుతున్న శ్రీ కనకపుట్లమ్మ పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన, డిబేట్, క్విజ్ పోటీల్లో ప్రతిభ కనబరిచి స్టూడెంట్ మాక్ అసెంబ్లీకి ఎంపికైంది. మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. ‘రాజ్యాంగ దినోత్సవం రోజున విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహణకు సీఎంతో మాట్లాడి నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేటి విద్యార్థులే రేపటి మా భవిష్యత్. సీఎం చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోదీ కూడా యువశక్తి గురించి మాట్లాడుతున్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు కృషిచేస్తున్నాం. అమ్మకు చెప్పకూడని పనులు చేయకూడదని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు నిన్నటి విలువల విద్యాసదస్సు కార్యక్రమంలో చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తాం. విద్యార్థులు బాగా చదువుకుని ప్రయోజకులుగా మారాలి. తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి. ప్రతి ఏడాది స్టూడెంట్ మాక్ అసెంబ్లీ నిర్వహిస్తాం. మిమ్మల్ని చూసి మరో పదిమంది విద్యార్థులు స్ఫూర్తి పొందుతార’ని మంత్రి అన్నారు.