News17th Jan 12:17 PMSunil Byrisetty1 min read

బ్యాట్ పట్టి.. క్రికెట్ ఆడి.. మంత్రి లోకేశ్ సందడి

మంత్రి నారా లోకేశ్ క్రికెట్ గ్రౌండ్ లో సందడి చేశారు. మంగళగిరి బైపాస్ రోడ్డులోని బోగి ఎస్టేట్స్లోలో జరుగుతున్న మంగళగిరి ప్రీమియర్ లీగ్ (MPL) సీజన్-4 క్రికెట్ పోటీల్లో మంత్రి నారా లో

బ్యాట్ పట్టి.. క్రికెట్ ఆడి.. మంత్రి లోకేశ్ సందడి
మంత్రి నారా లోకేశ్ క్రికెట్ గ్రౌండ్ లో సందడి చేశారు. మంగళగిరి బైపాస్ రోడ్డులోని బోగి ఎస్టేట్స్లోలో జరుగుతున్న మంగళగిరి ప్రీమియర్ లీగ్ (MPL) సీజన్-4 క్రికెట్ పోటీల్లో మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. వల్లభనేని వెంకట్రావ్ యూత్, విక్కీ 11 జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కు ఆయన టాస్ వేశారు. ఈ సందర్భంగా లోకేశ్ స్వయంగా బ్యాట్ పట్టి క్రికెట్ ఆడారు. దీనికి సంబంధించిన ఫోటోలను మంత్రి నారా లోకేశ్ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. అవి SMలో వైరల్ గా మారాయి. బిజీ బిజీగా ఉండే మంత్రి బ్యాట్ పట్టి క్రికెట్ ఆడటంపై నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.
Andhra Pradesh Minister
Nara Lokesh
Mangalagiri Premier League
MPL Season 4
Cricket Match
Youth Sports
క్రికెట్ పోటీలు
యువత
క్రీడలు
సోషల్ మీడియా వైరల్
Scroll for the next article