News22nd Jul 03:54 PMSunil Byrisetty1 min read
మంత్రి లోకేష్ సహకారంతో కుట్టుమిషన్లు పంపిణీ
మంత్రి నారా లోకేష్ ఆర్థిక సహకారంతో నిర్వహిస్తున్న స్త్రీశక్తి కార్యక్రమం ద్వారా మంగళగిరి మండలంలో కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న 30 మంది మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు, సర్టిఫి
మంత్రి నారా లోకేష్ ఆర్థిక సహకారంతో నిర్వహిస్తున్న స్త్రీశక్తి కార్యక్రమం ద్వారా మంగళగిరి మండలంలో కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న 30 మంది మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు, సర్టిఫికెట్స్ పంపిణీ చేశారు. 70వ బ్యాచ్‌లో 60 రోజుల పాటు శిక్షణ పొందిన మహిళలకు టీడీపీ కార్యాలయం ఎమ్మెస్సెస్ భవన్‌లో మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో నియోజకవర్గ తెలుగు మహిళలు కుట్టుమిషన్లు అందజేశారు. మంత్రి నారా లోకేష్‌కు లబ్దిదారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధి సాధించడం ద్వారా ఆ కుటుంబాలు ఆర్థికంగా నిలబడతాయన్న ఉద్దేశ్యంతో మంత్రి నారా లోకేష్ స్త్రీ శక్తిని నెలకొల్పి ఉచితంగా మహిళకు కుట్టుమిషన్లు అందజేస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో మంగళగిరి నియోజకవర్గాన్ని మంత్రి నారా లోకేష్ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు.