News15th Jul 05:33 PMSunil Byrisetty1 min read

గంగానమ్మ ఆలయానికి మంత్రి లోకేష్ ఆర్థిక సాయం

భక్తుల కోరిక మేరకు తాడేపల్లి పట్టణంలోని 17వ వార్డులో ఉన్న శ్రీ గంగానమ్మ ఆలయంలో పొంగలి షెడ్ నిర్మాణం కోసం మంత్రి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ తన సొంత నిధుల నుంచి రూ.1.50 లక్షల ఆర

గంగానమ్మ ఆలయానికి మంత్రి లోకేష్ ఆర్థిక సాయం
భక్తుల కోరిక మేరకు తాడేపల్లి పట్టణంలోని 17వ వార్డులో ఉన్న శ్రీ గంగానమ్మ ఆలయంలో పొంగలి షెడ్ నిర్మాణం కోసం మంత్రి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ తన సొంత నిధుల నుంచి రూ.1.50 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. మంత్రి లోకేష్ పంపించిన ఈ సహాయాన్ని పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తాడిబొయిన భాస్కర్ గుద్దంటి నాగేశ్వరరావు, ఇట్ట భాస్కర్, కాటాబత్తిన నిర్మల, చిలకలపూడి రాంబాబు, చింక శీను, తాడిబోయిన గోపి, కంభం సాయి చంద్, బుర్రముక్కు శ్రీనివాసరెడ్డి, కొర్రపాటి విజయ్, మేక శ్రీధర్ రెడ్డి, ఓలేటి రాము, గణేష్ రావు, రేఖ, నాగబాబు పలగాని, దర్శి హరికృష్ణ, ఎస్.కే. రహమతుల్లా, పలగాని గాంధీ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక భక్తులు మంత్రి నారా లోకేష్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. భక్తుల అవసరాలను గుర్తించి వెంటనే స్పందించి సాయం అందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
Andhra Pradesh
Nara Lokesh
Gangamma Temple
Tadepalli
Andhra Pradesh
Temple Development
Pongali Shed
ఆర్థిక సహాయం
తెలుగుదేశం పార్టీ
మంగళగిరి ఎమ్మెల్యే
ఏపీ వార్తలు
Scroll for the next article