News26th Jun 03:29 PMSunil Byrisetty1 min read

రేవేంద్రపాడు విద్యార్థినికి మంత్రి నారా లోకేష్ సాయం

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో మండల టాపర్‌గా నిలిచిన విద్యార్థినికి మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా రేవేంద్రపాడు ఎంపీటీసీ కొప్పుల మధుబాబు రూ.91,413 ఆర్థికసాయం అందించారు. దుగ్గిరాల మండ

రేవేంద్రపాడు విద్యార్థినికి మంత్రి నారా లోకేష్ సాయం
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో మండల టాపర్‌గా నిలిచిన విద్యార్థినికి మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా రేవేంద్రపాడు ఎంపీటీసీ కొప్పుల మధుబాబు రూ.91,413 ఆర్థికసాయం అందించారు. దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు జడ్పీ హైస్కూల్ లో చదివిన గంపా ఉమామహేశ్వరి అనే విద్యార్థిని మొన్నటి పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 575 మార్కులు సాధించారు. దీంతో మండలంలో పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనిబరిచిన వారికి మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి లోకేష్ సాధించిన మెజార్టీతో నగదు బహుమతి అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా రూ.91,413 చెక్కును సదరు విద్యార్థినికి అందించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన తనకు అండగా నిలవడం పట్ల మంత్రి లోకేష్, టీడీపీ నేత మధుబాబుకు విద్యార్థిని కృతజ్ఞతలు తెలిపారు.
Andhra Pradesh news
nara lokesh
Gampa Umamaheswari
ZP High School
cheque of Rs. 91
413
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 575 మార్కులు
నారా లోకేష్ ఆర్థికసాయం
Scroll for the next article