News2nd Sep 12:29 PMSunil Byrisetty1 min read

కడపలో మంత్రి నారా లోకేష్ 69వ రోజు ప్రజాదర్బార్

పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కడప జిల్లా పర్యటనకు వచ్చిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.. ఉదయం కమలాపురం నియోజకవర్గం బుగ్గలేటిపల్లిలోని తన క్యాంప్ సైట్ లో 69వ రోజు

కడపలో మంత్రి నారా లోకేష్ 69వ రోజు ప్రజాదర్బార్
పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కడప జిల్లా పర్యటనకు వచ్చిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.. ఉదయం కమలాపురం నియోజకవర్గం బుగ్గలేటిపల్లిలోని తన క్యాంప్ సైట్ లో 69వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ ను కలిసేందుకు పెద్దఎత్తున ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్.. ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై వినతులు స్వీకరించారు. అనంతరం వారితో కలిసి ఫోటోలు దిగారు. కమలాపురం నియోజకవర్గం సీకే దిన్నె మండలం ఇప్పపెంట గ్రామానికి చెందిన 45 గిరిజన కుటుంబాలు కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాం. ఎలాంటి ఆధారం లేని తాము బుగ్గమక ప్రాజెక్టు వద్ద 60 ఎకరాలను చదును చేసుకుని పోడు వ్యవసాయం చేస్తున్నాం. సదరు వ్యవసాయ భూములకు డీకే పట్టాలు మంజూరు చేయాలని గ్రామస్థులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. కడప జిల్లా మండల పరిషత్ కార్యాలయంలోని ఉపమండల అభివృద్ధి అధికారి నేతృత్వంలో పనిచేస్తున్న మండలస్థాయి కంప్యూటర్ ఆపరేటర్లకు జీతాలను రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ ద్వారా చెల్లించాలని పంచాయతీ రాజ్ మండల లెవల్ కంప్యూటర్ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆయా విజ్ఞప్తులను పరిశీలించి పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
Andhra Pradesh Politics
Nara Lokesh
Praja Darbar
Kadapa District
Kamalapuram Constituency
Buggaletipalli
Podu Cultivation
DK Pattas
Panchayati Raj
పంచాయతీ రాజ్
కంప్యూటర్ ఆపరేటర్స్ సంక్షేమ సంఘం
Scroll for the next article