News8th Nov 12:41 PMSunil Byrisetty1 min read
కళ్యాణదుర్గంలో మంత్రి నారా లోకేష్ 71వ రోజు ప్రజాదర్బార్
అనంతపురం జిల్లా రెండు రోజు పర్యటనలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.. కళ్యాణదుర్గం పట్టణంలోని పార్టీ కార్యాలయం వద్ద 71వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. తనను కలిసేందుకు వచ్చిన ప్
అనంతపురం జిల్లా రెండు రోజు పర్యటనలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.. కళ్యాణదుర్గం పట్టణంలోని పార్టీ కార్యాలయం వద్ద 71వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రతిఒక్కరిని మంత్రి ఆప్యాయంగా పలకరించారు. తన ఇద్దరు కుమార్తెల ఉన్నత చదువుల కోసం ఆర్థికసాయం అందించాలని అనంతపురానికి చెందిన మదమంచి ప్రవీణ్ కుమార్ మంత్రి నారా లోకేష్ కలసి కోరారు. కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరించి న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ జేఏసీ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. అనంతపురం జిల్లా ఉప్పరపల్లిలో తాను ఐదు సెంట్ల ఇంటి స్థలాన్ని కొనుగోలుచేశానని, అయితే రామకృష్ణారెడ్డి, కుమారస్వామిరెడ్డి అనే వ్యక్తులు దౌర్జన్యపూరితంగా తన స్థలాన్ని ఆక్రమించారని పుట్టపర్తి మండలం గువ్వలకుంటపల్లి గ్రామానికి చెందిన ఈ.సురేంద్ర రెడ్డి మంత్రి నారా లోకేష్ ను కలిసి ఫిర్యాదు చేశారు. విచారించి తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. శ్రీ సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్టు లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిబ్బంది మంత్రి లోకేష్ ను కలిసి కోరారు. ఆయా విజ్ఞప్తులను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.