News11th Nov 05:06 PMSunil Byrisetty1 min read

టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ ప్రజాదర్బార్

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 72వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ ను స్వయంగా కలుసుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, త

టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ ప్రజాదర్బార్
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 72వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ ను స్వయంగా కలుసుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్.. వారు ఎదుర్కొంటున్న సమస్యలపై విజ్ఞప్తులు స్వీకరించారు. పలు సమస్యల పరిష్కారం కోసం అప్పటికప్పుడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. సాధ్యమైనంత త్వరగా అర్జీలు పరిష్కరించి అండగా నిలుస్తామని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పలు విజ్ఞప్తులు వచ్చాయి. టీడీపీ సానుభూతిపరుడిననే కక్షతో వైసీపీ హయాంలో అప్పటి ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తనపై అక్రమంగా హత్య కేసు బనాయించి ఇబ్బందులకు గురిచేశాడని, దీంతో తీవ్రంగా నష్టపోయానని సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం శిరిగారిపల్లికి చెందిన కే.రవీంద్ర మంత్రి నారా లోకేష్ ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. మాజీ సైనికుల సేవలను గుర్తించి కడప నగరం లేదా చింతకొమ్మదిన్నె మండలంలో 250 మంది మాజీ సైనికుల కుటుంబాలకు ఉచితంగా లేదా, ప్రభుత్వ నామమాత్రపు ధరతో పదెకరాల స్థలాన్ని కేటాయించి అండగా నిలవాలని కడపకు చెందిన జై జవాన్ మూచ్యువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఇలా వందలాదిగా వచ్చిన వినతులను పరిష్కరిస్తామని మంత్రి భరోసానిచ్చారు.
Andhra Pradesh
Nara Lokesh
TDP Public Darbar
TDP
Education Minister
IT Minister
Public Interaction
Kadapa
Dharmavaram
మంత్రి
ప్రజా వినతులు
కడప
ధర్మవరం
ప్రజా సమస్యలు
టీడీపీ
లోకేష్ ప్రజాదర్బార్
Scroll for the next article