News8th Apr 09:57 AMSunil Byrisetty1 min read

చేనేత చీర కొన్న మంత్రి లోకేష్

ఆంధ్రప్రదేశ్ పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య ఆధ్వర్యంలో మంగళగిరి తెనాలి రోడ్డులో నూతనంగా ఏర్పాటుచేసిన సాయిప్రియ హ్యాండ్లూమ్స్ షోరూమ్‌ను విద్య,

చేనేత చీర కొన్న మంత్రి లోకేష్
ఆంధ్రప్రదేశ్ పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య ఆధ్వర్యంలో మంగళగిరి తెనాలి రోడ్డులో నూతనంగా ఏర్పాటుచేసిన సాయిప్రియ హ్యాండ్లూమ్స్ షోరూమ్‌ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా షోరూమ్ వద్దకు చేరుకున్న మంత్రి లోకేష్‌కు కూటమి నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మధ్య రిబ్బన్ కట్ చేసి షోరూమ్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజలో పాల్గొన్నారు. అనంతరం నందం అబద్దయ్య మనవడు జొన్నాదుల సాయికుమార్ దంపతులను ఆశీర్వదించారు. షోరూమ్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని తొలిగా మంగళగిరి చేనేత చీరను కొనుగోలు చేసి చేనేతల పట్ల తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. స్వయంగా తన ఫోన్‌తో స్కాన్ చేసి నగదు చెల్లించారు. షోరూమ్ మొత్తం కలియతిరిగి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అందరితో కలిసి ఫొటోలు దిగారు.
Mangalgiri
Minister Nara Lokesh
handloom show
చేనేత చీర కొన్న మంత్రి లోకేష్
Scroll for the next article