Education27th Jul 03:08 PMSunil Byrisetty1 min read
బాలికల జూనియర్ కళాశాలను ప్రారంభించిన మంత్రి లోకేష్
విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో పర్యటించారు. కంకిపాడు మండలం పునాదిపాడులో పోలవరపు మాధవరావు, ఇతర కుటుంబ సభ్యుల విరాళం రూ.1.20 కోట్లు వెచ్చించి
విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో పర్యటించారు. కంకిపాడు మండలం పునాదిపాడులో పోలవరపు మాధవరావు, ఇతర కుటుంబ సభ్యుల విరాళం రూ.1.20 కోట్లు వెచ్చించి నూతనంగా నిర్మించిన ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు కళాశాల ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు సిబ్బంది, దాత కుటుంబ సభ్యులు ఘనస్వాగతం పలికారు. అనంతరం జిల్లా పరిషత్ హైస్కూల్ ప్లస్ బాలికల జూనియర్ కళాశాల భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల లేబరేటరీలను పరిశీలించారు. విద్యార్థులతో సంభాషించారు. బాగా చదువుకోవాలని వారికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. అనంతరం దాత కుటుంబ సభ్యులు, పూర్వ విద్యార్థులను కలిసి అభినందించారు. దాసరి ఆళ్వార స్వామి రచించిన భారతదేశ ప్రధానమంత్రులు పుస్తకాన్ని ఆవిష్కరించారు. విద్యార్థులతో కలిసి గ్రూప్ ఫోటో దిగారు.