News5th Nov 12:22 PMSunil Byrisetty1 min read

‘వసంతం-2025’ను ప్రారంభించిన మంత్రి లోకేష్

విజయవాడ ఎంజీ రోడ్డులోని శ్రీ శేషసాయి కల్యాణ వేదికలో క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ‘వసంతం-2025’ చేనేత వస్త్ర ఎగ్జిబిషన్ ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా ల

‘వసంతం-2025’ను ప్రారంభించిన మంత్రి లోకేష్
విజయవాడ ఎంజీ రోడ్డులోని శ్రీ శేషసాయి కల్యాణ వేదికలో క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ‘వసంతం-2025’ చేనేత వస్త్ర ఎగ్జిబిషన్ ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ‘వసంతం-2025’ పేరుతో రెండు రోజుల వార్షిక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్ లో వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత, చేతివృత్తుల కార్మికులు తయారుచేసిన వివిధ ఉత్పత్తులను 70కిపైగా స్టాల్స్ లో ఏర్పాటుచేశారు. ఆయా స్టాల్స్ ను మంత్రి పరిశీలించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రకృతి సహజసిద్ధ రంగులతో తయారు చేసిన ‘కొత్తూరు వసంత వర్ణ’ నూతన చేనేత బ్రాండ్ ను మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సెక్రటరీ ఎస్.రంజన, ఇతర ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ సుజాత, సౌభాగ్యలక్ష్మి, పద్మ, శైలజ తదితరులు పాల్గొన్నారు.
Ap
Nara Lokesh
Vasantham 2025
Handloom Exhibition
Vijayawada
Craft Council of Andhra Pradesh
Handicrafts
Weavers
ఎంజీ రోడ్ విజయవాడ
క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా
సాంప్రదాయ కళలు
వస్త్ర ప్రదర్శన
Scroll for the next article