Spiritual10th Oct 11:27 AMSunil Byrisetty1 min read

దసరా ఉత్సవాలకు మంత్రి నారా లోకేష్‌కు ఆహ్వానం

ఉండవల్లి సెంటర్‌లో శ్రీ గణేష్ యూత్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 11 నుంచి 20 వరకు జరగనున్న దసరా నవరాత్రి ఉత్సవాలకు మంత్రి నారా లోకేష్‌ను కమిటీ సభ్యులు ఆహ్వానించారు. ఉండవల్లిలోని ఆయన

దసరా ఉత్సవాలకు మంత్రి నారా లోకేష్‌కు ఆహ్వానం
ఉండవల్లి సెంటర్‌లో శ్రీ గణేష్ యూత్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 11 నుంచి 20 వరకు జరగనున్న దసరా నవరాత్రి ఉత్సవాలకు మంత్రి నారా లోకేష్‌ను కమిటీ సభ్యులు ఆహ్వానించారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో మంత్రి నారా లోకేష్‌ను ఉత్సవ కమిటీ ప్రతినిధులు, సభ్యులు కలసి ఆహ్వాన పత్రికను స్వయంగా అందజేశారు. దసరా పండగ సందర్భంగా నిర్వహించే ప్రత్యేక పూజా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక కార్యక్రమాలను వివరించిన సభ్యులు, ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి దివ్య ఆశీస్సులు పొందాల్సిందిగా కోరారు. కమిటీ సభ్యుల ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన మంత్రి నారా లోకేష్ తప్పకుండా ఉత్సవాలకు హాజరవుతానని తెలిపారని నిర్వహకులు తెలియజేశారు. అలాగే ఉత్సవాలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో, శాంతియుతంగా జరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీ గణేష్ యూత్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Scroll for the next article