News25th Sep 12:31 PMSunil Byrisetty1 min read
ఉపరాష్ట్రపతి, సీఎంతో కలిసి తిరుమలలో మంత్రి నారా లోకేష్
తిరుమలలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబునాయుడుతో కలిసి వేంకటాద్రి నిలయం వసతి సముదాయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర
తిరుమలలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబునాయుడుతో కలిసి వేంకటాద్రి నిలయం వసతి సముదాయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీవారి భక్తుల కోసం నూతనంగా నిర్మించిన వేంకటాద్రి నిలయం యాత్రికుల వసతి సముదాయం(పీఏసీ-5)తో పాటు శ్రీవారి ప్రసాదమ్స్ ఇన్ గ్రెడియంట్స్- విజన్ బేస్డ్ స్టోరింగ్ మెషిన్(లడ్డూ నాణ్యత యంత్రం) ను ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబునాయుడు లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా భవనం ప్రాంగణానికి చేరుకున్న రాధాకృష్ణన్, చంద్రబాబునాయుడుకు మంగళవాయిద్యాలతో అధికారులు ఘనస్వాగతం పలికారు. శ్రీ వేంకటేశ్వరస్వామికి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి వేంకటాద్రి నిలయం(పీఏసీ-5) ను లాంఛనంగా ప్రారంభించారు. సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. భవనం మొత్తం కలియతిరిగి భక్తులకు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. వసతి గృహం బుకింగ్ కౌంటర్ ను ఉపరాష్ట్రపతితో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆనం రాంనారాయణరెడ్డి, అనగాని సత్యప్రసాద్, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్
పాల్గొన్నారు.