News28th Aug 12:54 PMSunil Byrisetty1 min read
రాడిసన్ 5 స్టార్ హోటల్‌కు మంత్రి లోకేష్ శంకుస్థాపన
ప్రకాశం జిల్లా ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక రంగాల అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. సంతనూతలపాడు నియోజకవర్గం నాగులుప్పలపాడు మండలం చదలవాడ గ్రామంలో రూ.100 కోట్ల పెట్టుబడితో నిర్మి
ప్రకాశం జిల్లా ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక రంగాల అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. సంతనూతలపాడు నియోజకవర్గం నాగులుప్పలపాడు మండలం చదలవాడ గ్రామంలో రూ.100 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న రాడిసన్ హోటల్ కు మంత్రి లోకేష్ భూమిపూజ, శంకుస్థాపన చేశారు. రవిశంకర్ గ్రూప్, రవిప్రియ హాస్పిటాలిటీస్ ఎల్‌ఎల్‌పీ సంయుక్త భాగస్వామ్యంతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ హోటల్ ను నిర్మించనున్నారు. ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు కానున్న తొలి 5-స్టార్ హోటల్‌గా ఇది నిలవనుంది.
అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న రాడిసన్ హోటల్‌లో 151 విలాసవంతమైన గదులు, మల్టీ-క్యూసిన్ రెస్టారెంట్, ప్రీమియం బార్, లాంజ్ వంటి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. అంతర్జాతీయ స్థాయి స్విమ్మింగ్ పూల్, లగ్జరీ స్పా, అత్యాధునిక ఫిట్‌నెస్ సెంటర్ వంటి వసతులను కూడా ఏర్పాటు చేయనున్నారు. కార్పొరేట్ సమావేశాలు, సదస్సులు, ప్రభుత్వ కార్యక్రమాలు, వివాహాలు తదితర కార్యక్రమాల నిర్వహణకు 2,100 చదరపు మీటర్లకు పైగా విస్తీర్ణంలో భారీ బ్యాంకెట్ హాళ్లు, కాన్ఫరెన్స్ రూమ్‌లను నిర్మించనున్నారు. దీంతో ఒంగోలులో MICE, బిజినెస్ టూరిజం కార్యకలాపాలకు మరింత ఊతమివ్వనుంది. చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారి NH-16కు ఆనుకుని ప్రాజెక్టు ఏర్పాటు కానుండటంతో పారిశ్రామికవేత్తలు, వ్యాపార ప్రతినిధులు, పర్యాటకులకు ఈ హోటల్ ఎంతో అనుకూలంగా ఉండనుంది.