News16th May 04:01 PMSunil Byrisetty1 min read
ప్రధాని పిలిచారు.. లోకేశ్ వెళ్తున్నారు!
గతంలో ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ, అమరావతిలో పర్యటించిన సమయంలో మంత్రి నారా లోకేశ్‍ను తనను వచ్చి కలవాల్సిందిగా ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్ ఢిల్లీలో పర
గతంలో ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ, అమరావతిలో పర్యటించిన సమయంలో మంత్రి నారా లోకేశ్‍ను తనను వచ్చి కలవాల్సిందిగా ఆహ్వానించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్ ఢిల్లీలో పర్యటించనున్నారు.
శనివారం సాయంత్రం ప్రధానితో భేటీ కానున్నారు.
ప్రధాని అపాయింట్‍మెంట్ ఖరారు కావడంతో ఢిల్లీకి లోకేశ్ బయలుదేరనున్నారు.
అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న లోకేశ్ తొలుత హైదరాబాద్ వెళ్లి అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు