News14th May 04:14 PMSunil Byrisetty1 min read
పండుగ వాతావరణంలో టీడీపీ మహానాడు
కడపలో పండుగ వాతావరణంలో తెలుగుదేశం పార్టీ మహానాడును నిర్వహిస్తామని విద్య,ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మహానాడు ఏర్పాట్లపై పొలిట్ బ్యూరో సమావేశానికి ముందు మంగళగిరిలోని తె
కడపలో పండుగ వాతావరణంలో తెలుగుదేశం పార్టీ మహానాడును నిర్వహిస్తామని విద్య,ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
మహానాడు ఏర్పాట్లపై పొలిట్ బ్యూరో సమావేశానికి ముందు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మహానాడు కమిటీల కన్వీనర్లు, కో కన్వీనర్లతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమావేశం నిర్వహించారు.
పలువురు మంత్రులు, సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించారు.
పొలిట్ బ్యూరో సమావేశంలో మహానాడు ఏర్పాట్లపై మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలోని మంత్రుల కమిటీ నివేదిక ఇవ్వనుంది.
లోకేష్ మాట్లాడుతూ.. పార్టీ కష్టకాలంలో ఉన్నా, అధికారంలో ఉన్నా మహానాడును నిర్వహించామన్నారు.
గత ప్రభుత్వంలో మహానాడుకు అడుగడుగునా ఇబ్బందులు పెట్టారని చెప్పారు.
అయినా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేశారు.
వసతి, రవాణాకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని దిశానిర్దేశం చేశారు.
మూడు రోజుల పాటు మహానాడు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు.
మొదటి రోజు తెలుగుదేశం పార్టీ విధి విధానాలు, సిద్ధాంతాలు, కార్యాచరణపై చర్చించనున్నారు.
రెండో రోజు రాష్ట్రం కోసం కూటమి ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై రూపొందించిన తీర్మానాలపై చర్చ జరగనుంది.
మూడో రోజు బహిరంగ సభ నిర్వహించనున్నారు.