News25th Sep 09:42 AMSunil Byrisetty1 min read

ఐసిసి అధ్యక్షుడు జై షాతో మంత్రి లోకేష్ భేటీ

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) చైర్మన్ జై షాతో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు స్థానం కల్పించడం, రికార్డు స్థాయిలో ఐపీఎల్ మీడియా

ఐసిసి అధ్యక్షుడు జై షాతో  మంత్రి లోకేష్ భేటీ
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) చైర్మన్ జై షాతో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు స్థానం కల్పించడం, రికార్డు స్థాయిలో ఐపీఎల్ మీడియా హక్కులు, మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)ను ప్రారంభించడం, మహిళా క్రికెటర్లకు సమాన వేతనం అందించడంలో జై షా సాధించిన విజయాలను ప్రశంసించారు. ఆధునిక మౌలిక సదుపాయాలు, క్రీడా సాంకేతికత, యువత నైపుణ్యాభివృద్ధిని అనుసంధానిస్తూ, ఆంధ్రప్రదేశ్ ను నేషనల్ స్పోర్ట్స్ హబ్ గా మార్చేందుకు సహాయ, సహకారాలు అందించాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఒలింపిక్ ఈవెంట్‌ లకు, ముఖ్యంగా వాటర్ స్పోర్ట్స్ కు (సెయిలింగ్, రోయింగ్, విండ్‌సర్ఫింగ్, ఓపెన్-వాటర్ స్విమ్మింగ్, బీచ్ వాలీబాల్) విశాఖపట్నాన్ని సహ-ఆతిథ్య గమ్యస్థానంగా మార్చేందుకు సహకరించాలని కోరారు. అమిత్ షా ప్రారంభించిన గాంధీనగర్ ప్రీమియర్ లీగ్ (GPL) స్ఫూర్తితో, యువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించి క్షేత్రస్థాయిలో ప్రతిభను గుర్తించడానికి... ఆంధ్రప్రదేశ్ లోని 175 నియోజకవర్గాల్లో అసెంబ్లీ ప్రీమియర్ లీగ్‌ను ప్రారంభించాలని యోచిస్తున్నామని తెలిపారు. ఇటీవల 128 స్థానిక జట్లను భాగస్వామ్యం చేస్తూ మంగళగిరి ప్రీమియర్ లీగ్ (ఎంపీఎల్) విజయవంతంగా నిర్వహించిన విషయాన్ని మంత్రి లోకేష్ ప్రస్తావించారు.
Scroll for the next article