News8th Sep 09:47 AMSunil Byrisetty1 min read

పారిశ్రామికవేత్తలతో లోకేశ్ భేటీ

తమిళనాడులోని కోయంబత్తూరులో మంత్రి నారా లోకేశ్ పర్యటించారు. స్థానిక పారిశ్రామికవేత్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటూ ఆహ్వానించారు. పరిశ్రమలకు సింగిల్

పారిశ్రామికవేత్తలతో లోకేశ్ భేటీ
తమిళనాడులోని కోయంబత్తూరులో మంత్రి నారా లోకేశ్ పర్యటించారు. స్థానిక పారిశ్రామికవేత్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటూ ఆహ్వానించారు. పరిశ్రమలకు సింగిల్ విండో అనుమతులకు హామీ ఇచ్చారు. లాజిస్టిక్స్ హబ్‌గా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ డీపీఆర్‌తో వస్తే చాలు.. మిగతా బాధ్యత ప్రభుత్వానిదేనని వెల్లడించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పరిశ్రమ అనుకూల విధానాల వల్ల జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఇప్పటికే పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని వివరించారు. పరిశ్రమలకు గమ్యస్థానంగా మారిన ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టండి అంటూ మంత్రి లోకేశ్ పిలుపునిచ్చారు.
Andhra Pradesh Investments
Nara Lokesh
Coimbatore Industrialists
AP Industries
Single Window Clearance
Logistics Hub
Industrial Development
పారిశ్రామిక అభివృద్ధి
పెట్టుబడి అవకాశాలు
Scroll for the next article