News16th May 11:30 AMSunil Byrisetty1 min read
లోకేష్ టైం ఇవ్వట్లేదా? మంత్రి క్లారిటీ!
మంత్రి లోకేష్ టీడీపీ కార్యకర్తలకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో కార్యకర్తలతో సమావేశమైన మంత్రి పలు అంశాలపై మాట్లాడారు. అవేంటంటే.. 1) దయచేసి మీరు గ్రా
మంత్రి లోకేష్ టీడీపీ కార్యకర్తలకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు.
అనంతపురం జిల్లా గుంతకల్లులో కార్యకర్తలతో సమావేశమైన మంత్రి పలు అంశాలపై మాట్లాడారు. అవేంటంటే..
1) దయచేసి మీరు గ్రామంలో యూనిటీగా ఉండండి
2) గ్రామస్థాయిలో పని జరగపోతే మండలపార్టీ నాయకుల ద్వారా పనులు చేసుకోండి
3) అప్పటికి అవ్వకపోతే ఎమ్మెల్యే దగ్గరకి వెళ్ళండి
4) అప్పటికి అవ్వకపోతే మీ ఇంచార్జి మంత్రి దగ్గరికి వెళ్ళండి
5) అప్పటికి అవ్వకపోతే టీడీపీ సెంట్రల్ ఆఫీస్ మంగళగిరికి వచ్చి ఒక అర్జీ ఇవ్వండి...
మన ఇంట్లో ఉంటే పనులు అవ్వవు, దయచేసి మీ సొంత పనులు అడగండి, మీకు సమస్యలు లేకపోతే అప్పుడూ మిగతావారి పనులు తీసుకురండి, ఎవరూ నిరుత్సాహపడవద్దని సూచించారు.
అమ్మ మీద నాన్న మీద అలిగినట్టు పార్టీ మీద అలగండి కానీ అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దని వ్యాఖ్యానించారు.
దయచేసి మూడవవ్యక్తి చెప్పింది నమ్మవద్దని, లైవ్‌లో విన్నవి మాత్రమే నమ్మండని కోరారు.
లోకేష్ టైమ్ ఇవ్వడం లేదు అంటా? బాబు గారు అసలు కలవడం లేదు అంటా లాంటి పుకార్లు నమ్మవద్దని, తామూ మనుషులమేనని, వీలైనంత సమయం అందరికీ ఇస్తున్నామని లోకేష్ స్పష్టం చేశారు.