News6th Nov 10:14 AMSunil Byrisetty1 min read

ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మంత్రి లోకేష్ కు ఘనస్వాగతం

ఒంగోలు వద్ద మంత్రి నారా లోకేష్ కు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. టంగుటూరు టోల్ గేట్ వద్ద ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఏపీ మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల

ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మంత్రి లోకేష్ కు ఘనస్వాగతం
ఒంగోలు వద్ద మంత్రి నారా లోకేష్ కు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. టంగుటూరు టోల్ గేట్ వద్ద ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఏపీ మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగత ఏర్పాట్లు ఘనంగా చేశారు. భారీ గజమాలతో మంత్రి లోకేష్ కు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. పార్టీ జెండాలు, పుష్పగుచ్ఛాలు, జై తెలుగుదేశం నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ప్రజలు, కార్యకర్తల నుంచి మంత్రి లోకేష్ అర్జీలు స్వీకరించారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించి, ఫోటోలు దిగుతూ ముందుకు సాగారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం దగదర్తిలో రాష్ట్ర ఆగ్రోస్ కార్పోరేషన్ ఛైర్మన్ దివంగత మాలేపాటి సుబ్బానాయుడు నివాసానికి మంత్రి లోకేష్ వెళ్లనున్నారు. మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.
Nara Lokesh
Minister Lokesh
TDP
Ongole
Prakasam District
Nellore District
Tanguturu
Magunta Sreenivasulu Reddy
Damacharla Satya
Inturi Nageswara Rao
కావలి
మాలేపాటి సుబ్బానాయుడు
ఆగ్రోస్ కార్పొరేషన్
ప్రజలతో సమావేశం
పార్టీ కార్యకర్తలు
Scroll for the next article