News23rd Jun 06:21 PMSunil Byrisetty1 min read
జూన్ 4 రాష్ట్ర చరిత్రను మార్చిన రోజు
జూన్ 4 రాష్ట్ర చరిత్రను మార్చిన రోజు, ప్రజాస్వామ్యం గెలిచిన రోజు. బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ రాజ్యాంగం గొప్పతనం ఏంటో మరోసారి తెలిసిన రోజు అని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రాన
జూన్ 4 రాష్ట్ర చరిత్రను మార్చిన రోజు, ప్రజాస్వామ్యం గెలిచిన రోజు. బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ రాజ్యాంగం గొప్పతనం ఏంటో మరోసారి తెలిసిన రోజు అని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సుపరిపాలన – తొలిఅడుగు సందర్భంగా రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో లోకేష్ మాట్లాడుతూ... అందరూ కూటమి గెలిచింది, టిడిపి గెలిచింది, జనసేన గెలిచింది, బిజేపి గెలిచింది అంటున్నారు. గెలిచింది కూటమి కాదు గెలిచింది ప్రజలు. 94 శాతం స్ట్రైక్ రేట్ ..164 అవుట్ ఆఫ్ 175. ప్రజలు రికార్డులు బద్దలు కొట్టారు. చరిత్రను తిరగరాసారు. ఇది ప్రజా విజయమని అన్నారు. గత ఐదేళ్లు విధ్వంస పాలన మనం చూసాం. 10 లక్షల కోట్లు అప్పు చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ ను అప్పులప్రదేశ్ గా మార్చేశారని, ఒక్క కొత్త కంపెనీ తీసుకురాలేదు.. ఉన్న కంపెనీలు తరిమేశారని విమర్శించారు.