News4th Nov 11:30 AMSunil Byrisetty1 min read
వైసీపీకి ఆఫర్ ఇచ్చిన మంత్రి లోకేష్!
మంత్రి నారా లోకేష్ సంచలన ప్రకటన చేశారు. వైసీపీకి ఆయన బిగ్ ఆఫర్ ఇచ్చారు. రాజకీయాలు ఇప్పుడు కాదని, ఎన్నికల సమయంలో చేసుకుందామని హితవు పలికారు. “మేమే కాదు, మీరు కూడా పెట్టుబడులు తీసుకు
మంత్రి నారా లోకేష్ సంచలన ప్రకటన చేశారు. వైసీపీకి ఆయన బిగ్ ఆఫర్ ఇచ్చారు.
రాజకీయాలు ఇప్పుడు కాదని, ఎన్నికల సమయంలో చేసుకుందామని హితవు పలికారు. “మేమే కాదు, మీరు కూడా పెట్టుబడులు తీసుకురావచ్చు. అప్పుడు అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం” అని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర అభివృద్ధి అనేది అందరూ కలిసి చేయాల్సిన పనిగా నారా లోకేష్ చెప్పారు. “పెట్టుబడులకు వైసీపీ నాయకులు ఎవరైనా సిఫార్సులు చేసినా ఆమోదించే కార్యక్రమాన్ని చేపడతాం. లేక పెట్టుబడులు తీసుకువచ్చినా సంతోషమే. ఏపీని అభివృద్ధి చేసేందుకు ఎవరైనా ముందుకు రావొచ్చు. అందరితోనూ కలిసి పనిచేసేందుకు, కలిసికట్టుగా ముందుకు వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందీ లేదు. రాజకీయాలు కేవలం ఎన్నికల సమయంలోనే చేసుకుందాం. ప్రస్తుతం రాష్ట్ర అభివృద్ధిపైనే దృష్టి పెడదాం” అని మంత్రి నారా లోకేష్ అన్నారు.