Politics11th Mar 09:44 AMSunil Byrisetty1 min read
శ్రీమాత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహోత్సవాల్లో మంత్రి లోకేష్
శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని శ్రీమాత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఇలపై వెలసిన మహా విష్ణువు ప్రతిరూపం కదిరి
శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని శ్రీమాత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.
ఇలపై వెలసిన మహా విష్ణువు ప్రతిరూపం కదిరి శ్రీమాత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 9వ తేదీన అంకురార్పణతో ప్రారంభమయ్యాయి.
15 రోజులపాటు వైభవంగా సాగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం జరిగిన స్వామివారి కల్యాణమహోత్సవంలో మంత్రి పాల్గొని ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. కల్యాణ మహోత్సవాన్ని వీక్షించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా వేదపండితులు వసంత వల్లభుడికి మంత్రి నారా లోకేష్ తో సంకల్పం చేయించారు.
ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు.
అంతకుముందు శ్రీఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు వేద పండితులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు.
సత్యసాయి జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి లోకేష్ కు అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పట్టారు.
పుట్టపర్తి విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో కదిరి వస్తుండగా పార్టీ శ్రేణులు, ప్రజలు అడుగడుగునా ఘనస్వాగతం పలికారు.
ప్రతి గ్రామానా ఘనస్వాగతం పలుకుతూ పూలవర్షం కురిపించారు.
దారిపొడవునా బాణసంచా కాల్చుతూ తమ అభిమానం చాటుకున్నారు.
కాన్వాయ్ ను ఆపి ప్రతిఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్.. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు.