News12th Jan 12:17 PMSunil Byrisetty1 min read
షిరిడీలో కాకడ హారతిలో మంత్రి లోకేష్
షిరిడీలో మంత్రి నారా లోకేష్ దంపతులు పర్యటిస్తున్నారు. శ్రీసాయినాధుని దర్శించుకునేందుకు విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ సతీ సమేతంగా షిరిడీ చేరుకున్నారు. సోమవారం ఉదయం సాయిసన్నిధిల
షిరిడీలో మంత్రి నారా లోకేష్ దంపతులు పర్యటిస్తున్నారు. శ్రీసాయినాధుని దర్శించుకునేందుకు విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ సతీ సమేతంగా షిరిడీ చేరుకున్నారు. సోమవారం ఉదయం సాయిసన్నిధిలో నిర్వహించే కాకడ హారతిలో లోకేష్, బ్రాహ్మణి దంపతులు పాల్గొన్నారు. షిరిడీ చేరుకున్న లోకేష్ దంపతులకు కోపర్గావ్ ఎమ్మెల్యే, శ్రీసాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ మాజీ చైర్మన్ అశుతోష్ ఆకాశరావు కాలే, ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. మంత్రి వెంట చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తదితరులు ఉన్నారు. అలాగే మహారాష్ట్రలోని తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో లోకేష్ ను కలిసేందుకు వచ్చారు.