News17th Aug 11:51 AMSunil Byrisetty1 min read

ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి నారా లోకేష్ నివాళులు

ఏపీ అసెంబ్లీ సమావేశాలు నాలుగు రోజులపాటు జరగనున్నాయి. ఈ మేరకు బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా తొలుత వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి మంత్

ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి నారా లోకేష్ నివాళులు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు నాలుగు రోజులపాటు జరగనున్నాయి. ఈ మేరకు బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా తొలుత వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి నారా లోకేష్ ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పెద్ద ఎత్తున రాజధాని రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ రైతులు, గ్రామస్థులందరినీ ఆప్యాయంగా పలకరించారు. అనంతరం నాయకులందరూ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు.
Andhra Pradesh Assembly
Nara Lokesh
NTR
NTR Statue
Assembly Sessions
Amaravati
Venkatapalem
రాజధాని రైతులు
మంత్రులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
టీడీపీ
Scroll for the next article