Education2nd Jul 03:23 PMSunil Byrisetty1 min read

‘షైనింగ్ టీచర్’ ను సత్కరించిన మంత్రి లోకేష్

ప్రభుత్వ విద్య బలోపేతం కోసం ఉపాధ్యాయులపై పవిత్ర బాధ్యత ఉందని, విద్యాశాఖలో మొదటి ఏడాది సంస్కరణలు పూర్తయ్యాయని విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చ

 ‘షైనింగ్ టీచర్’ ను సత్కరించిన మంత్రి లోకేష్
ప్రభుత్వ విద్య బలోపేతం కోసం ఉపాధ్యాయులపై పవిత్ర బాధ్యత ఉందని, విద్యాశాఖలో మొదటి ఏడాది సంస్కరణలు పూర్తయ్యాయని విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. ఇకపై విద్యార్థుల అభ్యసన ఫలితాలపై దృషిసారిస్తామని లోకేష్ పేర్కొన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం మారుమూల గిరిజన గ్రామం జేఎం తండాలోని ప్రభుత్వ ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాలలో వృత్తిపట్ల అంకింతభావం చూపి అద్భుత ఫలితాలు సాధిస్తున్న ఉపాధ్యాయురాలు శ్రీమతి ఎం.కల్యాణి కుమారిని కుటుంబంతో సహా ఉండవల్లి నివాసానికి పిలిపించుకుని మంత్రి నారా లోకేష్ ‘షైనింగ్ టీచర్’ పేరుతో ఘనంగా సత్కరించారు. 2017లో జేఎం తండా మండల పరిషత్ ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాలకు బదిలీ అయిన ఉపాధ్యాయురాలు కల్యాణి తన అంకితభావంతో పాఠశాల రూపురేఖలు మార్చి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. ఉపాధ్యాయులందరికీ ఆమె ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.
Andhra Pradesh news
kurnool
nara lokesh
government schools
Teacher
shining teacher
m kalyani
ప్రభుత్వ పాఠశాలల ముందు నో అడ్మిషన్ బోర్డులు
Scroll for the next article