News16th May 12:28 PMSunil Byrisetty1 min read
గుత్తిలో మంత్రి నారా లోకేష్ 64వ రోజు ప్రజాదర్బార్
అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.. తన రెండో రోజు పర్యటనలో గుత్తి సమీపంలోని రామరాజుపల్లెలో ఉదయం 64వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలతో
అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.. తన రెండో రోజు పర్యటనలో గుత్తి సమీపంలోని రామరాజుపల్లెలో ఉదయం 64వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు.
వివిధ సమస్యలతో బాధపడుతున్న వారి నుంచి అర్జీలు స్వీకరించారు.
మంత్రి నారా లోకేష్ ను కలిసేందుకు ఉదయం నుంచే ప్రజలు బారులు తీరారు.
ప్రతి ఒక్కరిని స్వయంగా కలిసిన మంత్రి నారా లోకేష్... వారిని ఆప్యాయంగా పలకరించి వినతులు స్వీకరించారు.
ఆయా విజ్ఞప్తులను పరిశీలించి పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
నిన్న గురువారం గుంతకల్లు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో సమన్వయం సమావేశం అనంతరం మంత్రి నారా లోకేష్ 63వ ప్రజాదర్బార్ నిర్వహించారు.
పెద్దఎత్తున తరలివచ్చిన సామాన్య ప్రజానీకం, కార్యకర్తల నుంచి అర్జీలు స్వీకరించారు.