News16th Jul 12:43 PMSunil Byrisetty1 min read
మంత్రి నారా లోకేష్ 67వ రోజు ప్రజాదర్బార్
విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో ఉదయం 67వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. మంత్రి నారా లోకేష్‌ను తమ కలిసి సమస్యలు విన్నవించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తరలివచ
విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో ఉదయం 67వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. మంత్రి నారా లోకేష్‌ను తమ కలిసి సమస్యలు విన్నవించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు. ప్రతి ఒక్కరిని స్వయంగా కలిసిన మంత్రి.. వివిధ సమస్యలపై వారి నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తామని హామీ ఇచ్చారు. వ్యాపారంలో వాటా ఇస్తానంటూ కాకినాడకు చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరుడు కె.రాజభాస్కర రెడ్డి రూ.1.77 కోట్ల మేర మోసం చేశాడని, విచారించి తగిన న్యాయం చేయాలని బాపట్లకు చెందిన దొప్పలపూడి విష్ణు మంత్రి నారా లోకేష్ ను కలిసి ఫిర్యాదు చేశారు. వైసీపీ హయాంలో తనపై అక్రమ కేసులు నమోదు చేయడంతో పాటు చంపుతామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్త చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థలో గత 19 ఏళ్లుగా ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న 2,400 మందికి హెచ్ఆర్ పాలసీ లేదా మినిమమ్ టైమ్ స్కేలు ద్వారా ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పోరేషన్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా కార్పోరేషన్ లో సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల నియామకానికి సంబంధించి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.