News5th May 01:26 PMSunil Byrisetty1 min read
మంత్రి నారా లోకేష్ 61వ రోజు ప్రజాదర్బార్
రాష్ట్రవ్యాప్తంగా వివిధ సమస్యలతో బాధపడుతున్న సామాన్య ప్రజానీకానికి మంత్రి నారా లోకేష్ మొదటి రోజు నుంచి అండగా నిలుస్తున్నారు. సోమవారం ఉదయం ఉండవల్లి నివాసంలో 61వ రోజు ప్రజాదర్బార్ ని
రాష్ట్రవ్యాప్తంగా వివిధ సమస్యలతో బాధపడుతున్న సామాన్య ప్రజానీకానికి మంత్రి నారా లోకేష్ మొదటి రోజు నుంచి అండగా నిలుస్తున్నారు.
సోమవారం ఉదయం ఉండవల్లి నివాసంలో 61వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు.
తమ సమస్యలు విన్నవించేందుకు వివిధ జిల్లాల నుంచి పెద్దఎత్తున సామాన్యులు ఉండవల్లి నివాసానికి తరలివచ్చారు.
పెన్షన్, భూ సంబంధిత సమస్యలు, ఉద్యోగ, ఉపాధి, వైద్య, ఆర్థికసాయం కోసం పెద్దఎత్తున ప్రజాదర్బార్‌కు తరలివచ్చారు.
ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్.. వారి నుంచి అర్జీలు స్వీకరించారు.
ఆయా విన్నపాలను పరిశీలించి త్వరితగతిన పరిష్కారానికి కృషిచేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
పలు అర్జీలపై అప్పటికప్పుడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.