News13th Nov 10:25 AMSunil Byrisetty1 min read
ఏపీకి మారిటైమ్ అటానమీ, రోబోటిక్స్ స్కిల్లింగ్ సెంటర్
సాగర్ డిఫెన్స్ ఫౌండర్ కెప్టెన్ నికుంజ్ పరాశర్ తో మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో భేటీ అయ్యారు. పూణే లిక్విడ్ రోబోటిక్స్ కో-ప్రొడక్షన్ మోడల్ ను జువ్వలదిన్నెలో ఇండో-పసిఫిక్ కోసం ఎక్స
సాగర్ డిఫెన్స్ ఫౌండర్ కెప్టెన్ నికుంజ్ పరాశర్ తో మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో భేటీ అయ్యారు. పూణే లిక్విడ్ రోబోటిక్స్ కో-ప్రొడక్షన్ మోడల్ ను జువ్వలదిన్నెలో ఇండో-పసిఫిక్ కోసం ఎక్స్ పోర్ట్ హబ్ గా రెప్లికేట్ చేయాలని కోరారు. IIT తిరుపతి, ఆంధ్రా యూనివర్సిటీ (మెరైన్ ఇంజనీరింగ్) తో కలిసి మారిటైమ్ అటానమీ, రోబోటిక్స్ స్కిల్లింగ్ సెంటర్ ఏర్పాటు చేయండి. తూర్పు తీరంలో ఈస్టర్న్ నేవల్ కమాండ్, కోస్ట్ గార్డ్ కోసం మానవరహిత నౌకల సీ ట్రయల్స్, MRO, ఫ్లీట్ సపోర్ట్ కోసం జువ్వలదిన్నెకు స్థానం కల్పించేందుకు కృషిచేస్తాం. నిర్దేశిత సీ-ట్రయల్ ఏరియాకు ఏపీ ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. ఏపీ మారిటైమ్ బోర్డ్ పోర్టులలో హార్బర్ సెక్యూరిటీ, హైడ్రోగ్రాఫిక్ సర్వే కోసం USV ల పైలట్, కృష్ణా-గోదావరి బేసిన్ లో చమురు, గ్యాస్ ఆపరేటర్ల కోసం ఆఫ్ షోర్ తనిఖీ, APSDMA తో తుఫాను, వరద ప్రతిస్పందన కోసం ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయండి. ఎండ్యూర్ ఎయిర్ / సాగర్ UAV లైన్ ను ఏపీకి ఆహ్వానిస్తున్నాం. టైర్-2 సప్లయర్లను (కాంపోజిట్స్, బ్యాటరీలు, సెన్సార్లు, ఎలక్ట్రానిక్స్) నెల్లూరుకు తీసుకురండి. జువ్వలదిన్నె చుట్టూ మత్స్యకార కమ్యూనిటీల నుంచి ప్రాధాన్యత హైరింగ్, స్మార్ట్ ఫిషింగ్ ఫ్లీట్ నెట్ వర్క్ ను త్వరగా అభివృద్ధి చేయాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.