News10th Jul 12:53 PMSunil Byrisetty1 min read
రాజకీయాల్లోకి రావాలన్న చంద్రబాబు
పుట్టపర్తిలో జరుగుతున్న మెగా పేరెంట్-టీచర్ మీటింగ్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. 8, 10 తరగతి విద్యార్థులకు సీఎం చంద్రబాబు పాఠాలు బోధించిన అనంతరం మంత్రి లోకేష్ విద్యార్థులను
పుట్టపర్తిలో జరుగుతున్న మెగా పేరెంట్-టీచర్ మీటింగ్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. 8, 10 తరగతి విద్యార్థులకు సీఎం చంద్రబాబు పాఠాలు బోధించిన అనంతరం మంత్రి లోకేష్ విద్యార్థులను ప్రశ్నలు అడిగారు. మీలో ఎంత మంది రాజకీయ నాయకులు కావాలనుకుంటున్నారో చేతులెత్తమని విద్యార్థులను అడిగారు. అయితే, ఒక్క విద్యార్థి కూడా చేయి ఎత్తలేదు. స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయాల ఆవశ్యకత వివరించారు. చదువుకున్న వాళ్లంతా ఉద్యోగాలు చేసుకుంటే రాజకీయాలు మన జీవితాలను శాసిస్తాయన్నారు. మీరు కూడా రాజకీయాల్లో వచ్చి ప్రజా సేవ చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.