Education19th Jun 05:04 PMSunil Byrisetty1 min read

లాసెట్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ లాసెట్-2025, ఏపీ పీజీఎల్‌సెట్-2025 ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. విద్యార్థులు ర్యాంక్ కార్

లాసెట్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి లోకేష్
ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ లాసెట్-2025, ఏపీ పీజీఎల్‌సెట్-2025 ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. విద్యార్థులు ర్యాంక్ కార్డులను అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఏడాది లాసెట్ పరీక్షల్లో మొత్తం 95 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు మంత్రి నారా లోకేశ్ తన ‘ఎక్స్‌’ ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ పరీక్షలకు మొత్తం 27,253 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 20,826 మంది అర్హత సాధించినట్లు ఆయన తెలిపారు. మరోసారి బాలికలే టాపర్లుగా నిలిచి తమ ప్రతిభను చాటారని మంత్రి ప్రశంసించారు. పరీక్షలో విజయం సాధించిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అభ్యర్థులు ఫలితాలను cets.apsche.ap.gov.in/LAWCET/ అనే అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. అలాగే 'మనమిత్ర' వాట్సాప్ సర్వీస్ ద్వారా 9552300009 నంబర్‌కు మెసేజ్ చేసి ర్యాంక్ కార్డును పొందవచ్చు.
Education
Nara lokesh
Ap law cet Result
ఏపీ లాసెట్‌ ఫలితాలు
Scroll for the next article