Education12th Apr 12:02 PMSunil Byrisetty1 min read
ఇంటర్ ఫలితాలు విడుదల.. పదేళ్లలో అత్యధిక పాస్ పర్సెంటేజ్
ఏపీలో ఇంటర్ ఫలితాలను విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఓవరాల్‌గా ఫస్ట్ ఇయర్‌లో 70 శాతం, సెకండియర్‌లో 83 శాతం మంది విద్యార్థులు పాసైనట్టు మంత్రి నారా లోకేష్ వెల్లడ
ఏపీలో ఇంటర్ ఫలితాలను విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు.
ఓవరాల్‌గా ఫస్ట్ ఇయర్‌లో 70 శాతం, సెకండియర్‌లో 83 శాతం మంది విద్యార్థులు పాసైనట్టు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.
2014 నుంచి ఇదే అత్యధిక పాస్ పర్సెంటేజ్ అని తెలిపారు.
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సెకండియర్‌లో 69 శాతం మంది ఉత్తీర్ణత సాధించడం పదేళ్లలో అత్యధికమన్నారు.
ఫస్టియర్‌లోనూ 47 శాతం మంది పాస్ అయ్యారని, ఇది దశాబ్దంలో రెండో అత్యధికమని తెలిపారు.
విద్యార్థులు https://resultsbie.ap.gov.in వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను చూసుకోవచ్చు.
అలాగే, మన మిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 కి "Hi" మెసేజ్ పంపితే కూడా ఫలితాలను పొందవచ్చు.
ప్రతి విద్యార్థికి శుభాకాంక్షలు చెప్పడంతోపాటు నిరంతరం నేర్చుకుంటూ, ఎదుగుతూ, విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నానుని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.