News20th Jul 01:42 PMSunil Byrisetty1 min read
దశాబ్దాల సమస్యకు మంత్రి లోకేష్ పరిష్కారం
మంగళగిరి ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటా నిలబెట్టుకునేందుకు మంత్రి నారా లోకేష్ చిత్తశుద్ధితో కృషిచేస్తున్నారు. దశాబ్దాలుగా మంగళగిరి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు.
మంగళగిరి ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటా నిలబెట్టుకునేందుకు మంత్రి నారా లోకేష్ చిత్తశుద్ధితో కృషిచేస్తున్నారు. దశాబ్దాలుగా మంగళగిరి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో దశాబ్దాలుగా ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న సుమారు 3వేల మందికి ఈనెల 21,22 తేదీల్లో మన ఇల్లు – మన లోకేష్ పేరిట రెండో విడత శాశ్వత పట్టాలు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. మంగళగిరి డీజీపీ ఆఫీసు సమీపంలోని సీకే కన్వెన్షన్ హాలులో రెండో విడత పట్టాలు పంపిణీ చేయనున్నారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని కొండవాలు ప్రాంతాలు, అటవీ, దేవాలయ భూముల్లో వేలాది మంది ప్రజలు ఇళ్లు నిర్మించుకుని దశాబ్దాలుగా నివాసం ఉంటూ వస్తున్నారు. అయితే వారికి సంబంధిత భూములపై ఎటువంటి అధికారిక హక్కులు ఇప్పటివరకు లేవు. దీంతో సంబంధిత స్థలాలను తమ వారసులకు ఇవ్వాలన్నా, అత్యవసర సమయాల్లో రుణాలు తీసుకోవాలన్నా సాధ్యంకాని పరిస్థితులు నెలకొన్నాయి. మంగళగిరి ప్రజలు ఎదుర్కొంటున్న ఈ జఠిలమైన సమస్యను ఎన్నికలకు ముందు ప్రత్యక్షంగా చూసిన యువనేత లోకేష్... తాము అధికారంలోకి వస్తే ఈ మొండి సమస్యకు పరిష్కారం చూపుతానని భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే 2025 ఏప్రిల్ నెలలో మంగళగిరి రత్నాల చెరువు, యర్రబాలెం, నీరుకొండ తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న 3002మందికి నూతన వస్త్రాలు పెట్టి మరీ పట్టాలు పంపిణీ చేశారు. సుమారు రూ.1,000 కోట్ల విలువైన భూములను ఒక్కరూపాయి ఖర్చులేకుండా అర్హులైన పేదలకు శాశ్వత హక్కులు కల్పిస్తూ పట్టాలు అందజేశారు.