News29th Oct 02:05 PMSunil Byrisetty1 min read

మొంథా తుఫానుపై మూడో రోజు మంత్రి నారా లోకేష్ సమీక్ష

మొంథా తుఫానుపై ఆర్టీజీఎస్ కేంద్రంలో మూడో రోజు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. వివిధ జిల్లాల్లో మొంథా తుఫాను తీవ్రత, ఇప్పటివరకు జరిగిన నష్టంపై ఉన్నతాధికారులత

మొంథా తుఫానుపై మూడో రోజు మంత్రి నారా లోకేష్ సమీక్ష
మొంథా తుఫానుపై ఆర్టీజీఎస్ కేంద్రంలో మూడో రోజు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. వివిధ జిల్లాల్లో మొంథా తుఫాను తీవ్రత, ఇప్పటివరకు జరిగిన నష్టంపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. మొంథా తుఫాను వల్ల కలిగిన నష్టంపై ప్రాథమిక అంచనాలు త్వరితగతిన రూపొందించాలని అధికారులను ఆదేశించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణపై అధికారులను ఆరా తీశారు. ప్రధానంగా కోనసీమ, కృష్ణా, బాపట్ల, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగిందని వివరించారు. ముంపు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అందుబాటులో ఉండి బాధితులకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
Andhra Pradesh
Nara Lokesh
Montha Cyclone
Cyclone Relief
Disaster Management
RTGS Centre
Electricity Restoration
Konaseema
విద్యుత్ పునరుద్ధరణ
కోనసీమ
కృష్ణా జిల్లా
బాపట్ల
ఎన్టీఆర్ జిల్లా
ప్రకాశం
తుఫాను అప్‌డేట్
Scroll for the next article