News9th Jun 03:18 PMSunil Byrisetty1 min read
ప్రైవేటురంగాన్ని మించి ప్రభుత్వ విద్య
ప్రభుత్వ విద్యావ్యవస్థను ప్రైవేటురంగానికి మించి అద్భుతంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో విద్యారంగంలో అనేక సంస్కరణలు తెస్తున్నా, అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నా, సంస్కరణల ద్వారా రాబోయే
ప్రభుత్వ విద్యావ్యవస్థను ప్రైవేటురంగానికి మించి అద్భుతంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో విద్యారంగంలో అనేక సంస్కరణలు తెస్తున్నా, అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నా, సంస్కరణల ద్వారా రాబోయే నాలుగేళ్లలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తామని విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. పదోతరగతి, ఇంటర్మీడియట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారిని ప్రోత్సహించేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన షైనింగ్ స్టార్స్ అవార్ట్స్ -2025లో భాగంగా పార్వతీపురంలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లాలో పదోతరగతిలో ప్రతిభ కనబర్చిన 95 మంది, ఇంటర్మీడియట్‌లో ప్రతిభ కనబర్చిన 26 మందికి మంత్రి లోకేష్ అవార్డులు అందజేశారు. లోకేష్ మాట్లాడుతూ... మెరుగైన ఫలితాల సాధనకు వందరోజుల యాక్షన్ ప్లాన్ అమలుచేస్తున్నామన్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పుస్తకాలు, మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టామని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ విద్యార్థులు ఉన్నత చదువులు చదివి తిరిగి మీ పాఠశాలలకు సేవచేయాలని పిలుపునిచ్చారు.