News15th Sep 05:50 PMSunil Byrisetty1 min read

మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి!

రాష్ట్రంలో కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల అరాచకాలకు అంతులేకుండా పోతోందని, సింగరాయకొండలో విద్యార్థి సయ్యద్ తౌసీఫ్ హత్య, ఆ బిడ్డకు న్యాయం జరగాలని పోరాడిన తల్లి ఆత్మహత్య చేసుకోవడాన

మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి!
రాష్ట్రంలో కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల అరాచకాలకు అంతులేకుండా పోతోందని, సింగరాయకొండలో విద్యార్థి సయ్యద్ తౌసీఫ్ హత్య, ఆ బిడ్డకు న్యాయం జరగాలని పోరాడిన తల్లి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ జాతీయ అధ్యక్షులు బోడె రామచంద్రయాదవ్ తీవ్ర మండిపడ్డారు. కనిగిరిలో జరిగిన బాధిత మాతృమూర్తి అంత్యక్రియల్లో ఆయన పాల్గొని నివాళులర్పించారు. సింగరాయకొండలోని శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ వెనుక అధికార పార్టీకి, ప్రతిపక్ష వైసీపీకి చెందిన నాయకులతో పాటు ఒక పోలీస్ ఉన్నతాధికారి బంధువులు ఉన్నారని, అందుకే ఈ కేసును పూర్తిగా నిర్వీర్యం చేయడానికి కుట్రలు పన్నుతున్నారని రామచంద్రయాదవ్ ఆరోపించారు. ఈ ఘటన వెనుక ఎంతటి పెద్దవారున్నా తక్షణమే గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Andhra Pradesh
Bode Ramachandra Yadav
BCY Party
Nara Lokesh
Education Minister
Syed Tousif
Singarayakonda
Student Death Case
Sri Chaitanya Navodaya
ప్రైవేట్ విద్యాసంస్థలు
కార్పొరేట్ విద్య
విద్యార్థుల భద్రత
కనిగిరి
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
విద్యా వార్తలు
Scroll for the next article