News31st Jul 06:21 PMSunil Byrisetty1 min read
పారని జగన్ పాచికలు..సింగపూర్ పర్యటనలో రూ. 45 వేల కోట్ల పెట్టుబడులు
సింగపూర్ పర్యటనలో రూ. 45 వేల కోట్లతో పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నట్లు విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఐదేళ్లలో రూ. 45 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేలా సింగపూర్ త
సింగపూర్ పర్యటనలో రూ. 45 వేల కోట్లతో పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నట్లు విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఐదేళ్లలో రూ. 45 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేలా సింగపూర్ తో ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు. సింగపూర్ అధికారులకు మురళీకృష్ణ అనే వ్యక్తి ఈమెయిల్ పంపారని, రేపో మాపో ఏపీలో ప్రభుత్వం మారిపోతుందని ఈమెయిల్ పంపారని వివరించారు. ఈ -మెయిల్ పెట్టిన మురళీ కృష్ణకు వైసిపి నేతలతో సంబంధాలు ఉన్నాయన్నారు. పెట్టుబడులు రాకుండా ఈమెయిల్ పెట్టారని మండిపడ్డారు. పెట్టుబడుల కోసం తమిళనాడులో డిఎంకె,ఏఐడీఎంకే కలిసికట్టుగా పనిచేస్తాయన్నారు. ఏపీలో మాత్రం పెట్టుబడులు రాకుండా కంపెనీలకు వైసీపీ లేఖ రాస్తుందన్నారు. జగన్ పాచికలు పారలేదని, త్వరలోనే పెద్ద ఎత్తున పెట్టుబడులు రానున్నాయని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.