News30th Jun 01:56 PMSunil Byrisetty1 min read

దక్షిణాసియాలోనే మొట్టమొదటి క్యాంటమ్ వ్యాలీ

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సాంకేతిక విప్లవం రెండో చాప్టర్ క్యాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ అని, ప్రజారాజధాని అమరావతిని దక్షిణాసియాలోనే మొట్టమొదటి క్యాంటమ్ వ్యాలీగా మారుస్తామని విద

దక్షిణాసియాలోనే మొట్టమొదటి క్యాంటమ్ వ్యాలీ
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సాంకేతిక విప్లవం రెండో చాప్టర్ క్యాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ అని, ప్రజారాజధాని అమరావతిని దక్షిణాసియాలోనే మొట్టమొదటి క్యాంటమ్ వ్యాలీగా మారుస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో నిర్వహించిన అమరావతి క్యాంటమ్ వ్యాలీ వర్క్ షాప్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారితో కలిసి మంత్రి పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. ఈ వర్క్ షాప్ నకు హాజరైన శాస్త్రవేత్తలు, పరిశోధకులు, సాంకేతిక నిపుణులు, విద్యారంగ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, ఇతర అధికారులకు స్వాగతం పలికారు. అమరావతి వర్క్ షాప్-2025కు మిమ్మల్ని స్వాగతించడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. ఇవాళ ఈ సమావేశం దేశంలో అత్యుత్తమ క్వాంటమ్ మేధావుల సమావేశం మాత్రమే కాదని, దేశంలో ఓ కీలక మలుపు కానుందని వివరించారు. భవిష్యత్ లో రాబోయే సాంకేతిక విప్లవానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నారనే సంకేతాన్ని ఇస్తోందని పేర్కొన్నారు..
Andhra Pradesh news
Amaravati
Cm chandra babu
nara lokesh
quantum valley workshop
క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ
Scroll for the next article