Politics29th Mar 11:33 AMSunil Byrisetty1 min read
పనిచేసే వారికి ప్రమోషన్ ఇస్తా
‘కార్యకర్తల కోసం నేను బయట ఎంత పోరాడతానో పార్టీలో కూడా అంతే పోరాడతాను. నా లక్ష్యం ఒక్కటే పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు, నాయకులను గుర్తించడమేన’ని మంత్రి లోకేష్ అన్నారు. తెలుగుదేశం
‘కార్యకర్తల కోసం నేను బయట ఎంత పోరాడతానో పార్టీలో కూడా అంతే పోరాడతాను.
నా లక్ష్యం ఒక్కటే పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు, నాయకులను గుర్తించడమేన’ని మంత్రి లోకేష్ అన్నారు.
తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సభలో లోకేష్ మాట్లాడుతూ.. గ్రామ స్థాయి నాయకుడు రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదగాలి అనేది నా కోరిక.
పార్టీ ముందు ఒక ప్రతిపాదన ఉంచానన్నారు.
రెండు టర్మ్‌లు ఒక పదవి చేసిన తరువాత పైకి అయినా వెళ్ళాలి లేదా ఒక టర్మ్ గ్యాప్ అయినా తీసుకోవాలని తెలిపారు.
ఇది జరిగితే పార్టీలో కదలిక వస్తుంది.
జాతీయ ప్రధాన కార్యదర్శిగా 4వససారి పనిచేస్తున్నానని చెప్పారు. ‘పార్టీలో ప్రక్షాళన నాతోనే మొదలు పెట్టండి.
యువకులకు రాజకీయాల్లోకి రావాలనే కోరిక వస్తుంది. నా స్టయిల్ ఒక్కటే... సీనియర్లను గౌరవిస్తా ... పనిచేసే జూనియర్లకు ప్రమోషన్ ఇస్తా. పార్టీ మరో నలభై ఏళ్లు బ్రతకాలి అంటే కొత్త రక్తం ఎక్కించాలి. దానికి అందరి సహకారం కావాలి. పనిచేసిన వారికే పదవి అనేది నా విధానం. నాయకుల చుట్టూ కాదు ప్రజల చుట్టూ తిరిగే వారికే పదవులు ఇస్తాం. పార్టీలో పూర్తి స్థాయి ప్రక్షాళన చేస్తాం. త్వరలోనే అన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తున్నామ’ని లోకేష్ అన్నారు.