Politics7th Mar 11:37 AMSunil Byrisetty1 min read
వలసల నివారణకు చర్యలు: మంత్రి లోకేష్
యువగళం పాదయాత్రలో కుటుంబాలు మూకుమ్మడిగా వలసలు వెళ్లడం చూశానని, ఒకే వాహనంపై 200మంది వెళ్లడం గమనించానని మంత్రి నారా లోకేష్ అన్నారు. అవన్నీ చూశాక ఇరిగేషన్, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల
యువగళం పాదయాత్రలో కుటుంబాలు మూకుమ్మడిగా వలసలు వెళ్లడం చూశానని, ఒకే వాహనంపై 200మంది వెళ్లడం గమనించానని మంత్రి నారా లోకేష్ అన్నారు.
అవన్నీ చూశాక ఇరిగేషన్, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తిచేసి, సాగు, తాగునీరు ఇస్తామని హామీ ఇచ్చానన్నారు.
కర్నూలు జిల్లాలో శివారు ప్రాంతాలకు సైతం సాగు, తాగునీరు అందించడమే లక్ష్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో చర్చించానన్నారు.
కరువు ప్రాంతాల్లో ప్రజలు వేరేచోటకు వలసలు వెళ్లిన సమయంలో అక్కడ అడ్మిషన్లు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. హాస్టళ్ల పనితీరు, విద్యార్థుల ట్రాకింగ్ ఉంటేనే డ్రాపవుట్స్ తగ్గుతాయన్నారు.
రాష్ట్రంలో 2024-25లో 121 సీజనల్ హాస్టళ్లు ఉండగా, వాటిలో 6,040 మంది విద్యార్థులకు భోజన వసతి కల్పించామని, ఇందుకోసం 6.04కోట్లు ఖర్చు పెడుతున్నామని వివరించారు. సీజనల్ హాస్టళ్ల నిర్వహణ ఇప్పటివరకు ప్రణాళికాబద్ధంగా లేదని, వివిధ సంవత్సరాల్లో ఎక్కువ, తక్కువలు ఉన్నాయని గుర్తించామన్నారు.
పిల్లలకు మెరుగైన విద్య అందించాలన్నదే లక్ష్యమని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.