News8th May 02:03 PMSunil Byrisetty1 min read
ఎల్‌జీ శ్రీసిటీ యూనిట్‌కు మంత్రి లోకేష్ భూమిపూజ
రాష్ట్రంలో సృష్టించబడే ప్రతి ఉద్యోగం, ఆవిష్కరణ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ఎలక్ట్రానిక్ పవర్ హౌస్‌గా మార్చేందుకు బాటలు వేస్తున్నామని విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అ
రాష్ట్రంలో సృష్టించబడే ప్రతి ఉద్యోగం, ఆవిష్కరణ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ఎలక్ట్రానిక్ పవర్ హౌస్‌గా మార్చేందుకు బాటలు వేస్తున్నామని విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
అంతర్జాతీయస్థాయి గృహోపకరణాల తయారీ సంస్థ ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ శ్రీసిటీ యూనిట్‌కు లోకేష్ భూమిపూజ చేశారు.
మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. మేం ఈరోజు ఎల్‌జీ యూనిట్‌కు మాత్రమే కాదు - ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం కొత్త పునాదులు వేస్తున్నాం.
ఈ కార్యక్రమం ఒక నిర్మాణ ప్రాజెక్టు ప్రారంభం కంటే పెద్దది.
ఇది మన రాష్ట్రంతోపాటు భారతదేశ పారిశ్రామిక వృద్ధి, సాంకేతిక పురోగతిలో ఒక మైలురాయి.
ఆవిష్కరణ పెట్టుబడిని కలిసే చోట, భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది.
₹5,000 కోట్లకు పైగా పెట్టుబడితో LG ఎలక్ట్రానిక్స్ ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచ స్థాయి తయారీ యూనిట్‌ను తీసుకురావడమే గాక ఏపీని పెట్టుబడుల గమ్యస్థానంగా ప్రపంచ విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తోంది.
మేడ్ ఇన్ ఆంధ్ర నుంచి మేడ్ ఫర్ ది వరల్డ్ వరకు మా జైత్రయాత్ర కొనసాగుతుంది.
ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి ప్రధాన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఒకటిగా ఎల్‌జీ శ్రీసిటీ యూనిట్ ఆవిష్కృతమైంది.