News18th Aug 09:17 AMSunil Byrisetty1 min read
నేడు కేంద్రమంత్రులతో మంత్రి లోకేష్ భేటీలు
ఢిల్లీలో పర్యటిస్తున్న ఏపీ మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహించనున్నారు. పెండింగ్ ప్రాజెక్ట్ లపై చర్చిస్తారు. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తో భేటీకానున్న నారా
ఢిల్లీలో పర్యటిస్తున్న ఏపీ మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహించనున్నారు. పెండింగ్ ప్రాజెక్ట్ లపై చర్చిస్తారు. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తో భేటీకానున్న నారా లోకేష్ ఏపీకి సెమీకండక్టర్ యూనిట్ మంజూరుకు ధన్యవాదాలు తెలపనున్నారు.
అనంతరం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీతో భేటీకానున్నారు. అలాగే ఓడరేవులు, జలరవాణా మంత్రి శర్బానంద సోనోవాల్‍తో భేటీ కానున్నారు. వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్‍తో, విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ తో భేటీ అయి పలు అంశాలపై చర్చించనున్నారు. ప్రభుత్వ ప్రతిపాదనలను కేంద్రమంత్రులకు మంత్రి లోకేష్ అందించనున్నారు.