News11th Oct 12:24 PMSunil Byrisetty1 min read

రేపు విశాఖలో మంత్రి నారా లోకేష్ పర్యటన

విశాఖలో 5 లక్షల ఐటీ ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.. ఈ దిశగా శరవేగంగా అడుగులు వేస్తున్నారు. అక్టోబర్ 12వ తేదీ ఆదివారం విశాఖలో మొట్టమొదటి

రేపు విశాఖలో మంత్రి నారా లోకేష్ పర్యటన
విశాఖలో 5 లక్షల ఐటీ ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.. ఈ దిశగా శరవేగంగా అడుగులు వేస్తున్నారు. అక్టోబర్ 12వ తేదీ ఆదివారం విశాఖలో మొట్టమొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్(CLS) కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఏఐ ఆధారిత డేటా సెంటర్ రాక వల్ల భారతదేశ తదుపరి గ్లోబల్ డిజిటల్ గేట్ వేగా విశాఖ రూపుదిద్దుకోవడంతో పాటు సముద్రపు కేబుల్ కనెక్టివిటీ, ఏఐ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయనుంది. రాష్ట్రంలో సాంకేతిక రంగం అభివృద్ధిలో భాగంగా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.. నాస్ డాక్ లో నమోదైన దేశ ప్రముఖ డిజిటల్ ఐసీటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ సిఫీ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ నిర్మించబోయే 50 మెగావాట్ల ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్ తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కు శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 3.6 ఎకరాల భూమిలో రూ.1500 కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ ను సిఫీ అభివృద్ధి చేయనుంది. తద్వారా వెయ్యిమందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
Andhra Pradesh
Visakhapatnam Development
Nara Lokesh
AI Edge Data Center
Cable Landing Station
Sify Technologies
డిజిటల్ గేట్‌వే
లోకేష్ విశాఖ పర్యటన
Scroll for the next article