News16th Jun 03:24 PMSunil Byrisetty1 min read
విశాఖకు మంత్రి నారా లోకేష్
విశాఖకు మంత్రి నారా లోకేష్ చేరుకున్నారు. ఎంపీ సీఎం రమేష్, మంత్రి కొల్లు రవీంద్ర, ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, పార్టీ శ్రేణులు మంత్రికి
విశాఖకు మంత్రి నారా లోకేష్ చేరుకున్నారు. ఎంపీ సీఎం రమేష్, మంత్రి కొల్లు రవీంద్ర, ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, పార్టీ శ్రేణులు మంత్రికి ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయానికి వచ్చిన ప్రజలు, పార్టీ శ్రేణులతో కలిసి ఫొటోలు దిగారు. ఈ నెల 21న విశాఖలో జరగనున్న ప్రపంచ యోగా దినోత్సవ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించనున్న సమీక్షలో మంత్రి నారా లోకేష్ పాల్గొననున్నారు. విశాఖలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు ఇప్పటికే పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.