News6th Aug 02:18 PMSunil Byrisetty1 min read

కోనసీమ యూత్ సమ్మిట్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి లోకేష్

అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఆగస్టు 12న మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో రామచంద్రాపురంలో జరుగనున్న కోనసీమ యూత్ సమ్మిట్ పోస్టర్ ను మంత్ నారా లోకేష్ ఆవిష్కరించారు. లోకేష్

కోనసీమ యూత్ సమ్మిట్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి లోకేష్
అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఆగస్టు 12న మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో రామచంద్రాపురంలో జరుగనున్న కోనసీమ యూత్ సమ్మిట్ పోస్టర్ ను మంత్ నారా లోకేష్ ఆవిష్కరించారు. లోకేష్ మాట్లాడుతూ యువతలో దాగి ఉన్న టాలెంట్ ను, స్కిల్స్ ను రాష్ట్ర భవిష్యత్ అవసరాల కోసం వినియోగించుకునేందుకు కోనసీమ యూత్ సమ్మిట్ వంటి కార్యక్రమాలు దోహద పడతాయన్నారు. యువత తమ ఆలోచనలు వ్యక్తపరచడానికి యూత్ సమ్మిట్ సరి అయిన వేదికగా ఉపయోగపడుతుందని మంత్రి లోకేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అభివృద్ధి అజెండాగా భవిష్యత్ ప్రణాళికలు చర్చించడంతో పాటు, యువత లోని నాయకత్వ లక్షణాలు, పరిస్థితులకు తగినట్లు వేగంగా నిర్ణయాలు తీసుకునే ఆలోచన విధానాలను యూత్ సమ్మిట్ వంటి కార్యక్రమాల ద్వారా యువత అలవర్చు కోవాలని ఆయన సూచించారు. పోస్టర్ ఆవిష్కరణలో మంత్రులు నిమ్మల రామానాయుడు, ఆనం రామనారాయణ రెడ్డి, కొలుసు పార్థసారథి, సవిత, గుమ్మడి సంధ్యారాణి, అనగాని సత్య ప్రసాద్, రాం ప్రసాద్ రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్, జనార్ధన్ రెడ్డి పాల్గొన్నారు.
Andhra Pradesh news
nara Lokesh
Konaseema Youth Summit
International Youth Day 2025
Youth Empowerment
Youth Summit
Vasamsetti Subhash
యువజన దినోత్సవం
కోనసీమ యూత్ సమ్మిట్
Scroll for the next article