News10th Sep 05:25 PMSunil Byrisetty1 min read

స్వచ్ఛథాన్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి లోకేష్

స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 2న విజయవాడలో భారీ స్థాయిలో నిర్వహించే స్వచ్ఛథాన్ పోస్టర్ ని మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. స్వచ్ఛతా రన్‌లో పాల్గొనేవారు తమ పేర్లను ర

స్వచ్ఛథాన్  పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి లోకేష్
స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 2న విజయవాడలో భారీ స్థాయిలో నిర్వహించే స్వచ్ఛథాన్ పోస్టర్ ని మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. స్వచ్ఛతా రన్‌లో పాల్గొనేవారు తమ పేర్లను రిజిస్టర్ చేసుకునేందుకు అమరావతిరన్నర్స్.కామ్ (amaravatirunners.com) పోర్టల్‌ని కూడా మంత్రి లాంచ్ చేశారు. విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ ఇంటర్నేషనల్ స్టేడియమ్ వద్ద ఆ రోజు ఉదయం 5 గంటలకు స్వచ్ఛతా రన్ ప్రారంభమవుతుంది. 5కే, 10కే, 21.1కే (ఆఫ్ మేరాతన్) మూడు కేటగిరీలలో ఈ రన్ ని ‘అమరావతి రన్నర్స్’ వారు నిర్వహిస్తారు. బాలురు, బాలికలు, యువత .. అన్ని వయసుల వారు పాల్గొనడానికి అవకాశం కల్పిస్తారు. పాల్గొనేవారికి టీషర్ట్స్ తోపాటు బ్రేక్ ఫాస్ట్ కూడా ఏర్పాటు చేస్తారు. అన్ని విభాగాలలో విజేతలకు దాదాపు రూ.10 లక్షల విలువైన బహుమతులతోపాటు మెడల్స్, సర్టిఫికెట్స్ అందజేస్తారు. పాల్గొన్నవారందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేస్తారు. ఈ రన్ లో పాల్గొనేవారు ఈ నెల 20వ తేదీ లోపల తమ పేర్లను ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలి.
Andhra Pradesh
Nara Lokesh
Swachhathon
Swachhata Run
Swachh Andhra Corporation
Vijayawada
Amaravati Runners
5K Run
10K Run
Half Marathon
Clean
హాఫ్ మారథాన్
స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్
విజయవాడ ఈవెంట్
అక్టోబర్ 2
ఆంధ్రప్రదేశ్ వార్తలు
Scroll for the next article