Politics25th Jun 02:03 PMSunil Byrisetty1 min read

ప్రతిరోజూ ఫీడ్ బ్యాక్ తీసుకుంటాం!

ఇకపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, నేను ప్రతిరోజు 5గురు ప్రజలు, 5గురు కార్యకర్తలతో మాట్లాడి ప్రభుత్వ కార్యక్రమాల అమలుతీరు, పార్టీ అంతర్గత సమస్యలపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటాం, కమ్యూని

ప్రతిరోజూ ఫీడ్ బ్యాక్ తీసుకుంటాం!
ఇకపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, నేను ప్రతిరోజు 5గురు ప్రజలు, 5గురు కార్యకర్తలతో మాట్లాడి ప్రభుత్వ కార్యక్రమాల అమలుతీరు, పార్టీ అంతర్గత సమస్యలపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటాం, కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి, పార్టీ కోసం కష్టపడిన ఏ ఒక్క కార్యకర్తను విస్మరించేది లేదు, తప్పనిసరి వారి సేవలను గుర్తిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. మచిలీపట్నంలో నిర్వహించిన ఉత్తమ కార్యకర్తల సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ... గత ఎన్నికలకు ముందు బాబు సూపర్ – 6, బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ, ఎన్నికల తర్వాత మన టిడిపి, సభ్యత్వం కార్యక్రమాల్లో కార్యకర్తలంతా చురుగ్గా పాల్గొన్నారు. పార్టీ కార్యకలాపాలను డిజిటల్ విధానంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించి పనిచేసిన వారిని గుర్తించాలన్నదే మన పార్టీ విధానం. అధికారంలోకి వచ్చాక కేడర్ ను మరువకుండా చంద్రబాబు గారు, నేను ప్రతిజిల్లాకు వెళ్లినపుడల్లా కార్యకర్తలను కలుస్తున్నాం. పార్టీ అధినేత నుంచి కార్యకర్త వరకు పార్టీ ఆదేశాలను అమలు చేస్తాం. తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబం. పార్టీ సంస్థాగత విషయాలు, సమస్యలపై చంద్రబాబు గారితో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నా. 10 నిర్ణయాల్లో ఒక తప్పు జరగొచ్చు, తప్పులున్నపుడు వివిధ స్థాయిల్లో నాయకుల ద్వారా తమ దృష్టికి తెస్తే సరిదిద్దుకుంటాం అని లోకేష్ అన్నారు.
Andhra Pradesh news
Machalipatanam
TDP
minister nara lokesh
Tdp Activist
take feedback every day
పార్టీ అంతర్గత సమస్యలపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటాం
Scroll for the next article