News12th Nov 12:42 PMSunil Byrisetty1 min read

ఏపీ పెవిలియన్, ఎంఎస్ఎంఈ ప్రదర్శనను సందర్శించిన మంత్రి లోకేష్

విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా ప్లీనరీ హాల్‌లో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ పెవిలియన్, ఎంఎస్ఎంఈ ప్రదర్శనను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్య

ఏపీ పెవిలియన్, ఎంఎస్ఎంఈ ప్రదర్శనను సందర్శించిన మంత్రి లోకేష్
విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా ప్లీనరీ హాల్‌లో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ పెవిలియన్, ఎంఎస్ఎంఈ ప్రదర్శనను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో కలిసి రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, కళా వైభవాన్ని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను వారు పరిశీలించారు. అరకు కాఫీని మంత్రి లోకేష్ రుచి చూశారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన రాజధాని అమరావతి టవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తిరుపతి, విశాఖపట్నం, అమరావతి ఎకనామిక్ రీజియన్లలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అధికారులు ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు.
Scroll for the next article