News30th Jul 03:51 PMSunil Byrisetty1 min read

క్యాపిటాల్యాండ్ సిఇఓతో మంత్రి లోకేష్ భేటీ

క్యాపిటాల్యాండ్ ఇన్వెస్టిమెంట్స్ (CLI) సిఇఓ సంజీవ్ దాస్ గుప్తాతో విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. CLI స్థిరమైన పెట్టుబడులకు ప్రాధాన్యతనిస్తున్నందున

క్యాపిటాల్యాండ్ సిఇఓతో మంత్రి లోకేష్ భేటీ
క్యాపిటాల్యాండ్ ఇన్వెస్టిమెంట్స్ (CLI) సిఇఓ సంజీవ్ దాస్ గుప్తాతో విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. CLI స్థిరమైన పెట్టుబడులకు ప్రాధాన్యతనిస్తున్నందున విశాఖలోని డేటా సెంటర్‌లను వారి క్యాప్టివ్ పవర్ ప్లాంట్ల ద్వారా పునరుత్పాదక శక్తితో పూర్తిగా శక్తివంతం చేయవచ్చని చెప్పారు. సాంప్రదాయ సాఫ్ట్‌వేర్ కంపెనీలు వైజాగ్ వంటి టైర్ 2 నగరాలకు తరలివస్తున్న నేపథ్యంలో వైజాగ్, విజయవాడలో IT/సాఫ్ట్‌వేర్ పార్కులు, మిశ్రమ అభివృద్ధి నమూనాల ఏర్పాటును పరిశీలించాలని సూచించారు. రాష్ట్రంలోని కీలకమైన పారిశ్రామిక కారిడార్‌లలో పారిశ్రామిక గిడ్డంగులు / పారిశ్రామిక పార్కుల ఏర్పాటు చేయాలని కోరారు. క్యాపిటా ల్యాండ్ సిఇఓ సంజీవ్ దాస్ గుప్తా స్పందిస్తూ.. ధీషన్ గ్లోబల్ స్పేసెస్‌తో కలిసి పనిచేస్తున్న క్యాపిటాలాండ్... శ్రీ సిటీ సమీపంలో 400 కోట్ల రూపాయల పెట్టుబడితో ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్స్ పార్క్‌ను స్థాపించాలని భావిస్తున్నట్లు చెప్పారు. దీని ద్వారా దాదాపు 5వేలమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అన్నారు.
Andhra Pradesh news
CapitaLand Investments
Sanjeev Dasgupta
Nara Lokesh
Visakhapatnam Data Centers
Industrial and Logistics Parks
డేటా సెంటర్‌లు
పారిశ్రామిక పార్కులు
Scroll for the next article